రాజకీయం

మరోసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

131 Views

– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు

దౌల్తాబాద్: మూడేళ్ల పాలనలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్యంపేట, సూరంపల్లి, లింగరాజు పల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అప్పులపాలు చేశారని విమర్శించారు.దళిత బంధు, బీసీ బందు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని ఎంపీని మీ ఊర్లోకి వస్తే నిలదీయాలని అన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ముదిరాజ్ కులస్తుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో ఒకే ఒక ముదిరాజ్ బిడ్డ ఈటెల రాజేందర్ ఉంటే అతనిని కూడా పార్టీ నుండి వెళ్లగొట్టారని, ముదిరాజ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పార్టీకి సీటు ఇద్దామా ఓటు వేద్దామా అని ఆలోచించాలని అన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారని ముదిరాజ్ కులస్తులు ఆలోచించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. దుబ్బాక గడ్డపై బిజెపి జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. అనంతరం లింగరాజు పల్లి శివాజీ యూత్ సభ్యులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేత కనకరాజు, జిల్లా అధికార ప్రతినిధి మంగలి యాదగిరి, సూరంపల్లి ఉపసర్పంచ్ స్వామి, బిజెపి మండలాధ్యక్షుడు కిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, ప్రసాద్ రావు, రంజిత్ గౌడ్, రామస్వామి గౌడ్, అనిల్ రెడ్డి, రాజు, తుమ్మల గణేష్, కుర్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *