(తిమ్మాపూర్ సెప్టెంబర్ 20)
తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి రాజు ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరంపల్లి రమణరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉప్పులేటి రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పోరాటం చేసిన కార్యకర్తను గుర్తించి తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానన్నారు.వచ్చే ఎన్నికలలో మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణరాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




