రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సపాయి కార్మికురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో కార్మికురాలుగా పనిచేస్తున్న జంగం లక్ష్మీనరసవ్వ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో సపాయి కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె మృతికి సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి తోటి సఫాయి కార్మికులు నివాళులు అర్పించారు.
