రాజకీయం

దళిత బహుజన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణ స్వరూప్

54 Views

దళిత బహుజన పార్టీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేసిన జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్.

నేడు హైదరాబాద్ హిమాయత్నగర్ లోని దళిత బహుజన పార్టీ కేంద్ర కార్యాలయం లో కార్యక్రమం జరిగింది.
1. దళిత జాతులను ఎస్సీ ఎస్టీ బీసీ ల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం.
2 .ప్రజలందరికి విద్యా. వైద్యం ఉచితంగా అందచేయడం జరుగుతుంది.
3.ఇండియా దేశ రాజ్యాంగం. చట్టాలను ను ఖచ్చితంగా అమలు
4. ఎస్సీ. ఎస్టీ. బీసీ. మైనారిటీ సామాజిక వర్గం నకు అన్ని జీవన. సామాజిక రంగాలలో సోషల్ జస్టిస్ అమలు చేయడం.
5 .కార్మిక. కర్షక. విద్యార్థి. యువజన. మహిళా. మేధావుల హక్కులు అమలు.రక్షణ
6.పౌరులందరికి సామాజిక రక్షణ కల్పించడం.
7 .దళిత జాతులకు రక్షణ కల్పించడం. ఎస్సీ. ఎస్టీ చట్టం 1989 ను పటిష్టంగా అమలు చేయడం.నిందితులకు కఠిన శిక్షలు విధించడం.
8 .వ్యవసాయం. పారిశ్రామిక. పర్యావరణ రంగాలను అభివృద్ధి చేయడం.
9.పౌరులందరికి విద్యా. వైద్యం. ఆరోగ్యం. సంక్షేమ. రక్షణ. జీవన అవకాశాలను ఉచితంగా కల్పించడం.
10. ఎస్సీ ఎస్టీ బీసీ లకు విద్యా. ఉద్యోగ. రాజకీయ రిజర్వేషన్ ల శాతన్ని 80 శాతానికి పెంపుదల పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం సాధనకు కృషి చేయడం.
11. భూమి లేని పేదలందరికి 2 ఎకరాల వ్యవసాయం భూమిని పంపిణీ చేయడం.
భూమి సంస్కరణ చట్టం ను ఖచ్చితంగా అమలు చేయడం.
12 .సొంత ఇల్లు లేని కుటుంబం నకు 5 సెంటుల ఇంటి స్థలం లో గృహ నిర్మాణం ను ఉచితంగా నిర్మించడం.
13.నిరుద్యోగులకు ఉపాధి. ఉద్యోగం కల్పన.
14.విద్యా. వైద్యం. ఆరోగ్య రంగాలకు 50 శాతం నిధులు బడ్జెట్ లో కేటాయించడం.
15. తెలంగాణ లోని కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు.
పోలీస్ స్టేషన్. కోర్ట్ ల్లో అవినీతి. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపైన కఠిన చర్యలు తీసికోవడం.తదితర అంశాలు పార్టీ మ్యాని ఫెస్టో లో ఉన్నాయి.
ఈ కార్యక్రమం లో పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ అధ్యక్షులు డాక్టర్. వి. ఎల్. రాజు. డిప్యూటీ చైర్మన్ జె. ఎన్. రాజు. కో. ఆర్డినేటర్స్ దేవునూరి శ్రీనివాసు. బీరం సతీష్ కుమార్.
ఎన్నికల కమిటీ సభ్యులు ఎమ్. డి. హుస్సేన్. పల్లవి సాంబయ్య వడ్డెర. నక్కా రాజేందర్రావు. గంధం శంకర్. మద్దెల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *