Breaking News ప్రకటనలు

చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ..

127 Views

చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ..
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
యాంటీ డ్రగ్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల విద్యార్థులకు బహమతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. శనివారం రోజున ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల నుండి ముగ్గురు విద్యార్థినిలు చిత్రలేఖనం పోటీలలో విజేతలుగా నిలిచారు.కాగా
సిరిసిల్ల పట్టంలోని నర్సింగ్ కాలేజి ఆవరణలో విద్యార్థినిలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల విద్యార్థులు చిత్రలేఖనంలో రాణించారని రాహుల్ ,కొండ్లెపు లహరి, గండికోట సోనీ బహుమతులు అందుకున్నారు
సేఫ్టీ,మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/లపై అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
మహిళలు,విద్యార్థినులు వేధింపుల నుండి బయట పడేందుకు దైర్యంగా ముందుకు వెళ్ళడమే మార్గామని,విద్యార్థినిలు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేదింపులకు సంబందించి ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, టీచర్స్ కు గానీ తెలియజేయాలని, ఎవరైనా తమ పట్ల చిన్న తప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముందుగానే గుర్తించి అలాంటి వారిని దూరంగా ఉంచాలన్నారు.జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో డ్రెస్ లలో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.విద్యార్థులు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, , సి.ఐ లు, షీ టీం ఏ. ఎస్.ఐ ప్రమీల సిబ్బంది ప్రియాంక, రమదేవి,శ్రీధర్, భరోసా సెంటర్ సిబ్బంది ,కళాశాల, పాఠశాల సిబ్బంది ,విద్యార్థులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found