ఘనంగా బతుకమ్మ సంబరాలు
అక్టోబర్ 22
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రకృతిలో లభించినటువంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు ఆటపాటలతో మహిళలు ఆడారు డీజే సౌండ్ తో పాటలు పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూత ఆడారు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మ గౌరమ్మ అంటూ చండూరు గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
చండూరు గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది చిన్నారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
