ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ
ఘనంగా సద్దుల బతుకమ్మ నిమజ్జనం
అక్టోబర్ 22
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా, సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి పల్లె వెలుగులతో ఆడపడుచులతో ఊరంతా సందడిగా నెలకొంది ఉదయం నాలుగు గంటలకే పల్లె నిద్ర లేచింది అడవికి వెళ్లి వివిధ రకాల పూలను తీసుకొచ్చి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అని 9 అంతరాలుగా బతుకమ్మను పేర్చారు పిండి వంటలు తయారుచేసి చద్ది మూట చంకన పెట్టుకొని బతుకమ్మను ఎత్తుకొని డప్పు చప్పులతో కొంతసేపు గ్రామంలో ఆడి చెరువు వద్దకు చేరుకున్నారు నీటితో చెరువు ఎంతో అందంగా ఉంది పల్లె అందాలను చెరువును చూస్తే వర్ణించడం ఆ కవులకు సాధ్యమయ్యేనా అన్నట్లుగా చెరువు ఉన్నది.
కొంతసేపు మహిళలు ఆటపాటలు, కోలాటాలు ఆడి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందారు బతుకమ్మను తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు వెంట తెచ్చుకున్న చద్ది మూట విప్పి ఆరగించి బయలుదేరారు మళ్లీ తిరిగి రా మా ఇంటికి రా బతుకమ్మ అంటూ బతుకమ్మను సాగనంపి ఇంటికి చేరుకున్నారు
