పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)సందర్భంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ 1959 వ సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు.
