అక్టోబర్/10; వీర్నపల్లి మండలంలోని వన్ పల్లిగ్రామ పరిధిలోని మూడు తండాల ప్రజలు కలిసి అడిషనల్ కలెక్టర్ ఖీమ్యనాయక్ నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయుటకు వినతిపత్రం అందించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ సుమారు 600 పైచిలుకు జనాభా 350 పైగా ఓటర్లు కలిగి ఉన్నాముమనీ. గ్రామం నుండి తండాలు దూరంగా ఉండటంవల్ల అభివృద్ధి మరియు పరిపాలన సౌలభ్యంకోసం నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆగ్రామాల ప్రజలు దయచేసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మాఅభివృద్ధికి తోడుపడగలరు అని గిరిజనులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేశాయ్ నాయక్, రవీందర్ నాయక్, గణేష్ నాయక్, జగన్, లింభ, నరహరి, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
