ప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. డిసెంబర్ 30 2022 రోజున మృతుడు షైక్ నజర్ తండ్రి రహీమోద్దీన్, వయస్సు (33) రోజున బయటకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో జనవరి 01 2023 రోజున మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తులో ఉండగా ఆదివారం రాత్రి 7 గంటలకు మృతుని శవం గ్రామ శివారులోని చెరువులో కనిపించింది.
మృతుడు చెరువు దగ్గరికి పోయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారనిఅతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఎవరి మీద ఎటువంటి అనుమానం లేదని తెలిపారు.