ముస్తాబాద్/అక్టోబర్/10; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారుకానీ వాటిపోషణ మరిచారు దీంతో మొక్కలు ఎక్కడికక్కడ ఎండిపోతు దర్శనమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ వర్షాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు గారిపోతుంది మండలంలోని పలుగ్రామాల ప్రధాన రహదారి వెంబడి నాటిన లక్షలాది మొక్కలతో ఎన్ని చిగురుస్తున్నాయో ఎన్ని మోడువారిపోతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొని ఉంది మొక్కలు నాటిన తర్వాత వాటిపెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ప్రభుత్వ లక్ష్యం నీరుగారుస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఓపక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎవర్ గ్రీన్ గా పచ్చదనంతో ఉండాలని కోరుకుంటే నాటిన మొక్కలకు, ట్రీగార్డులు లక్షలు వెచ్చించిన ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ప్రధాన రహదారికి ముస్తాబాద్ వడ్డెర కాలనీ నుండి తెర్లుమద్ది క్రాసింగ్ బంధనకల్ స్టేజి వరకు ఇదే దుస్థితి ఇరుపక్కల గార్డులు చిందరవందరగా పడిఉన్న పట్టించుకోని అధికారులు మండలంలోని ఏగ్రామాలకు వెళ్లిన ఇదేపరిస్థితి ఇకనైనా అధికారులు స్పందించి మొక్కలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.




