తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా లో ఈనెల 12,13 వ తేదీలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సూచించిన విధంగా అభ్యర్థులు ఆన్లైన్లో అటేస్టేషన్ ఫారం తీసుకోవాలి. టి ఎస్ ఎల్ పి ఆర్ బి వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫామ్ అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్ గా పూర్తి చేసిన తర్వాత మూడు సెట్లు ఏ 4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకొని అభ్యర్థులు సంతకాలు చేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించాలి,ఈ ఫామ్, సర్టిఫికెట్స్ జిరాక్స్ లపై గెజిటెడ్ ఆఫీసర్ తో ధృవీకరణ సంతకం తీసుకోవాలి.




