6 గ్యారంటీలు అమలు చేస్తాం తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్
అక్టోబర్ 20
దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీ ల గురించి ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు బి ఆర్ ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల హామీలు రైతు రుణమాఫీ గృహలక్ష్మి దళిత బంధు నెరవేర్చటంలో విఫలమయ్యారన్నారు ఉద్యోగాల పేరుతో పేపర్ లీకేజీలతో యువకుల జీవితాల్లో చెలగాటమాడుతున్నారు ఇప్పటికైనా మనమందరం మేల్కొని బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల మేనిఫెస్టో మహిళలకు వృద్ధులకు యువకులకు వాడవాడల్లోని ప్రతి ఇంట్లో వివరించి జనాలను ఉత్తేజపరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమ్మరి చంద్రప్ప ప్రభాకర్ రెడ్డి ఆశీర్వాదం సుందరప్ప గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు





