100 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూలై16 సపాయి కార్మికులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి అన్నల గణేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్‌లో నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల శిబిరాన్ని 11.వ రోజకు చేరుకున్న ఆదివారం సందర్శించి అలాగే ఐదేళ్లకు పైచిలుకు వేతనాలు పెంచాలని పలుమార్లు సమ్మెచేస్తే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశాడన్నారు. తల్లికి భోజనం పెట్టుమని అడుగుతే పినతల్లికి బంగారు గాజులు చేస్తానన్నట్టు ఈరాష్ట్రాన్ని చూసుకోలేని కెసిఆర్ పక్కరాష్ట్రాలకు బాసటగా నిలిచారన్నారు. ఎన్ని సమ్మెలు చేసిన కార్మికులను ఆదుకున్న పాపాన ఈప్రభుత్వం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఏనాడు పంచాయతీ కార్మికుల గురించి ఆలోచించలేదన్నారు. నేటినుండి జిల్లాలోని ప్రతి గ్రామంలో నల్లాలసప్లై కూడా పూర్తిస్థాయిలో విస్మరింస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలొ ఈవిధంగా ఉంటే రాష్ట్రంలోని బంగారు తెలంగాణేది ఇలాగుంటే మాసఫాయీ కార్మికులు సమ్మెఉద్ధృతం చేస్తామన్నారు.
No Slide Found In Slider.
Poll not found