ప్రాంతీయం

ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి

101 Views

బీఎస్పీ ఆధ్వర్యంలో ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే జయంతి ఘనంగా నివాళులు

-కొండనోళ్ళ నరేష్ బీఎస్పీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి

సిద్దిపేట గజ్వేల్, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 )

బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే కి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్  మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విముక్తి కోసం,పురుషాధిక్యత నుంచి స్త్రీ విముక్తి కోసం,,పేద వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన తల్లి, చదువుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం అని, అక్షర జ్ఞానం తో పేదరికం, కుల వివక్ష ,అంటరాని తనం నిర్మూలన చేయగలమని నమ్మి, ఆనాడు కులాది పత్య పురుషాధిక్యత సమాజాన్ని వ్యతిరేకించి, ఎన్నో అవమానాలను ఎదుర్కొని సమ సమాజ నిర్మాణానికి దారులు వేసిన గొప్ప తల్లి మాత సావిత్రి బాయి ఫూలే అని అన్నారు.అదే విదంగా ఈ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె ఆశయాలకు గండి కొడుతూ పేద వర్గాలకు, బహుజన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నాయని విమర్శించారు.పేద వర్గాలకు ఉచిత, విద్య, వైద్యం, సమ సమాజ నిర్మాణం అందించడమే ఆమె ఆశయాలు, వాటిని బీఎస్పీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తుందని అన్నారు.గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కెత్తోజి వినోద్ మాట్లాడుతూ ఈ రోజు స్త్రీలు అన్ని రంగాల్లో విజేతలుగా నిలుస్తున్నారంటే అది మాత సావిత్రి బాయి ఫూలే  ఆ రోజు చేసిన కృషి, పోరాట ఫలితాలే కారణమని అన్నారు.గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము చంద్రం  మాట్లాడుతూ ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం బీఎస్పీ కట్టుబడి ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆశని కనక ప్రసాద్, కార్యదర్శి క్యాసారం శ్రీకాంత్, జిల్లా బీవీఫ్, కన్వీనర్ భూమగారి నాగరాజు, ప్రజ్ఞాపూర్ ప్రసాద్ మౌర్య,మర్కుక్ మండల అధ్యక్షులు తెడ్డు నవీన్, తూప్రాన్ మండల అధ్యక్షులు పుట్ట నరేష్, తూప్రాన్ టౌన్ అధ్యక్షులు పర్స సాయికుమార్ , పెంటకాడి సుధాకర్, చీమల నవీన్,బీవీఫ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *