రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించి కులం పేరుతో దూషించారని ఇటీవల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు అయిన ఆగకుండా వాట్సాప్ లో వాయిస్ రికార్డులు పెడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్ళగాక్కారు.. తమకు తమ ముగ్గురు పిల్లలకు రక్షణ కావాలని మీడియా సమావేశంలో పేర్కొన్నారు సిరిసిల్ల పోలీసులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు తమను చంపుతామని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
