నిమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కార్యక్రమం
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో నిమోనియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులైన కుమార్ దీపక్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవగాహన కార్యక్రమంలో కోసము పోస్టర్లను కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అనిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆర్ఎస్ పద్మ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది ద్వారా నిమోనియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన తల్లులకు కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని ఐదు సంవత్సరములు లోపు పిల్లలున్న ప్రతి ఇంటిలో ఈ అవగాహన కార్యక్రమాలు తెలియజేయాలని ఆదేశించినాడు నిమోనియా అనేది బ్యాక్టీరియా వైరస్ ల వలన కలిగే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ కావున జాగ్రత్త పడాలని ముఖ్యంగా ఈ చలికాలంలో పిల్లలు దగ్గు సర్ది జ్వరంతో బాధపడుతుంటారు కావున జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లలకు జ్వరము శ్వాస తీసుకునడంలో సమస్యలు అలసిపోవడం ఆకలి లేకపోవడం మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ముఖ్యంగా తల్లులకు అవగాహన కలిగించాలని కోరినారు నిమోకాకల్ టీటా ద్వారా పి సి వి చిన్నపిల్లలకు రాకుండా చేయవచ్చును కావున టీకాలు ఇప్పించాలి ఈ కార్యక్రమం జిల్లాలో మూడు నెలల పాటు నిర్వహించాలని కోరినారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవోలను అంగన్వాడి కార్యకర్తలను తల్లులను ఇంటి పెద్దలను అవగాహన కలిగించాలని కోరినారు ఫాన్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వైద్యులకు అవగాహన కలిగించడం ఆరోగ్య సిబ్బందికి నిమోనియా పైన శిక్షణ ఇవ్వడం మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రభుత్వాసుపత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో చిన్నపిల్లల వైద్యుల నిపుణుల సర్వీసులను సేవలను తీసుకొనడం గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం 100% టీకాలు ఇప్పించడం ప్రభావిత హైరిస్క్ పిల్లలను గుర్తించడం చికిత్సలు అందించడం చేయాలని కోరినారు.





