రహీం బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదానం శిబిరం.
జిల్లా మంచిర్యాల — మందమర్రి మండలం, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ — 9వ వార్డు కాంగ్రెస్ కార్యకర్త గోపతి బానేష్ మరియు రహీం బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదానం శిబిరం.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినోత్సవం సందర్భంగా, మెగా రక్తదాన శిబిరం ఘన విజయం
50 యూనిట్ల రక్తాన్ని స్వచ్ఛందంగా సేకరించి ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు అందజేత
ఈ మహత్తర కార్యక్రమం 9వ వార్డు కాంగ్రెస్ కార్యకర్త గోపతి బానేష్ మరియు
రహీం బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ రక్తాన్ని థలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్త చిన్నారుల మరియు గర్భిణీ స్త్రీ లకు, ప్రాణ రక్షణకు వినియోగించనున్నారు
రక్తదానంలో పాల్గొన్న రక్త దాతలకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు —మీ సేవ అమూల్యం.
ముఖ్య అతిథులు పాల్గొన్నవారు:
పిన్నింటి రఘునాథ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు, వడ్నాల శ్రీనివాస్ అధికార ప్రతినిధి,
స్థానిక నాయకులు మేకల శ్రీనివాస్, మల్లేష్, గోలి శ్రీనివాస్, నాగరాజు, గడికొప్పుల తిరుపతి, మహేష్ , శివ. మరియు యువకులు,
ఈ సేవా కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన క్యాతన్ పల్లి, 9వ వార్డు రక్త దాతలకు, ఐ ర్ సి ఎస్ బ్లడ్ బ్యాంక్ సమస్త యాజమాన్యంలకు, టెక్నీషియన లకు మరియు రహీం బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీంకి ప్రత్యేక కృతజ్ఞతలు.
నిర్వాహకుల సందేశం:
“ఒక రక్తధనం — ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.
మంత్రి జన్మదినాన్ని సేవ రూపంలో జరుపుకోవడం మా భాగ్యం అని అన్నారు.





