*తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంపు.?.. ఎంత పెరగనుందంటే..!*
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది ఇప్పిటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసింది ఈ నేపథ్యంలో త్వరలో ఆసరా పెన్షన్లు పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పెన్షన్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు త్వరలోనే పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు
సీఎం ప్రకటన మేరకు ఆసరా పింఛను మొత్తాన్ని వెయ్యి మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు గతనెల ఖమ్మం కాంగ్రెస్ సభలో పెన్షన్ రూ.4వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన కొన్ని రోజులకే దివ్యాంగుల పెన్షన్ పెంచారు ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర ఆసరా పెన్షన్‌దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రస్తుతం ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు రూ.2,016 పింఛను అందిస్తోంది ఆ మెుత్తాన్ని రూ.వెయ్యి పెంచి రూ.3,016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించింది సీఎం కేసీఆర్ ఆమోదం అనంతరం దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది
ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, పేద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బోదకాలు బాధితులు గీత చేనేత బీడీ కార్మికులు వృద్ధ కళాకారులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను అందిస్తోంది ఈ పెన్షన్లకు ప్రతి ఏటా రూ.11,628 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది మెుత్తం లబ్ధిదారుల్లో 5,16,890 మంది దివ్యాంగులు ఉండగా గత నెల నుంచి వారికి రూ.1000 పెంచింది వీరు పోగా మిగిలిన 39 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై మరో రూ.450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది.
