ప్రాంతీయం

6.గ్యారెంటీలతో గడపగడపకు కాంగ్రెస్…

535 Views

ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్18, ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 6,గ్యారెంటీలు, రైతులకు 2,లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తానని ప్రకటించడంతో, బిఆర్ఎస్ పార్టీకి గబులుపుట్టి 2,లక్షల ఋణమాఫీ పక్కన పెట్టి 6,గ్యారంటీలు మాత్రమే ఇస్తామని బిఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు. 9,ఏళ్ల పాలనలో అధికారాన్ని దుర్వినియోగం చేసి 2014లో, 2018లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసి అధికారంలో ఉండి కూడా 1200 పైచిలుకు ఉన్న సిలిండర్ను ఇప్పుడు 400కే సిలిండర్ ఇస్తా మనడం సిగ్గుచేటు అని అన్నారు. అందులో ముఖ్యంగా ఇది వరకె పెట్టిన లక్ష,రుణమాఫీ నత్తనడక నడుస్తుంది రెండు లక్షలు ఎలా మాఫీ చేయాలనె భయం పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ ను ఎదుర్కోలేక రాహుల్ గాంధీ అధినేత 6,గ్రారంటీలను ప్రకటించడంతో ఎటు తోచని పరిస్థితులలో గుండె ఆగిపోయినంత అయోమయంగా ఉన్న బిఆర్ఎస్ కారు 4, టైర్లకు గాలి దిగిపోయిందని ప్రజానీకానకి తెలిసిపోయి చేయి గుర్తుకు ఓటు వేద్దామని నిర్ణయించుకున్నారని అన్నారు. విద్యార్థులకు భోజనాలు టిఫిన్ల పేరుతో రైతుల బిడ్డలను మభ్యపెడుతున్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఎగ్జామ్ పెట్టి లీకేజ్ పేరుతో 9.సంవత్సరాలు కాలమెల్లదీస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని అన్నారు. 1200 మంది పైచిలుకు ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందంటే కేవలం కల్వకుంట్ల కుటుంబ కుబేరులకేనని అన్నారు, సంవత్సరాని రెండు లక్షల ఉద్యోగాలకు పైచిలుకు యువకులకు ఇచ్చేది పోగా వారికి ఇచ్చే జీతంతో డబ్బులు పింఛన్ల పేరుతో  9,సంవత్సరాల కాలం గడిపింది. లీకేజీ పేరుతో యువకులను ఆత్మహత్యలకు బలి చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి ఎలక్షన్ సమయంలో గుర్తొచ్చిందా ఈ బిఆర్ఎస్ మాయ మాటలు ప్రజలెవరు నమ్మవోరని అన్నారు. ఈకార్యక్రమంలో గజ్జల రాజు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు తలారి నర్సింలు, ఎస్సీ సెల్ జిల్లా కోకన్వీనర్ గంగాధరి రమేష్, బంధనకల్ గ్రామశాఖ అధ్యక్షుడు రాయం రంజిత్, వెంకటరావుపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కస్తూరి రాజిరెడ్డి, మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షుడు దొరుకుల కొండయ్య, కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు గాంతరాజు, రామ్ రెడ్డిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు సంఘం ఎల్లం, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, కార్యదర్శి శీలం రాజనర్సు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమురయ్య, సీనియర్ నాయకులు వేముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్రెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, అట్ల మహేష్ రెడ్డి, జంగిటి బాలరాజ్, కదిర సత్యం గౌడ్, కొండాపూర్ భరత్, రామ్ రెడ్డి పల్లి రమేష్, నవీన్, బోయ నర్సింలు ,పొన్నం రాజయ్య, రాకేష్ రెడ్డి, రమేష్ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *