ప్రాంతీయం

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

26 Views

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జనవరి 23, 2026:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్.టి.సి., విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై తక్కువ ఎత్తు గల బీమ్‌లు, తక్కువ విజిబిలిటీ ఉన్న చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లపై అదుపు తప్పిన, ఓవర్ లోడెడ్ వాహనాలు, పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీసు అధికారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాలలో అంతర్గత రహదారులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, రహదారులపై కేజ్ వీల్స్, ట్రాక్టర్ కేజ్ వీల్స్ వినియోగాన్ని నిలిపివేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కూరగాయల వ్యాపారులు రహదారులపై విక్రయాలు చేయకుండా ప్రత్యేక మార్కెట్ స్థలాన్ని గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. రహదారులపై వాహనాల వేగాని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలని, ప్రతి మండల, గ్రామాల పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేయాలని, వారి వివరాలు, పరిమితికి మించి లోడింగ్ చేసి తనిఖీలలో పట్టుబడిన వాహనాల వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. రహదారులపై సంచరించే పశువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాలకు తరలించాలని తెలిపారు. అంతర్గత రహదారులలో కల్వర్టుల దగ్గర సూచికలు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల బెడదను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓవర్ లోడింగ్, మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుb నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

డి.సి.పి. మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల నివారణను 20 శాతం మేర తగ్గించేలా లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, జిల్లాలో 30 హాట్ స్పాట్ లను గుర్తించడం జరిగిందని, నగర పరిధిలో వాహనాల వేగ నియంత్రణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *