మీడియా సమావేశంలో దొంగల వివరాలు స్వాధీనం చేసుకున్న సొమ్ము వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామనికి చెందిన రామటంకి సారయ్య@ వెంకటేష్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత సుమారుగా 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ జైలు శిక్ష అనుభవించాడు.అంతే కాక 2012 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు బసంత నగర్ ,కొనరావుపేట ,తంగళ్ళపల్లి చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, మానకొండూరు లో పలు దొంగతనాలు చేయగా 2017 వ సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరిగింది. 2019 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్లి ఆ తర్వాత కరీంనగర్ వచ్చి కోళ్ల ఫారం కోళ్ల దొంగతనాలు చేయగా అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టి పది నెలలపాటు జైల్లో ఉండి 2022 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చాడు.
తరువాత జగిత్యాల జిలాల్లో కిరాయి రూమ్ లో ఉంటూ హెల్మెట్లు, అద్దాలు, రెక్సీన్ పని చేసుకుంటూ ఉన్నాడు అయితే అతను చేసే పని సంపాదన తన జల్సాలకు సరిపోక తన గ్రామస్తుడు అయిన భూతం రాములు దగ్గరికి వెళ్లి దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దాం అని నిర్ణయించుకున్నారూ.వారు నిర్ణయించుకున్న ప్రకారము తేదీ 27-09-2023 రోజున ఇద్దరు కలసి బస్సులో మెట్పల్లి వెళ్లి అక్కడ ఏదైనా దొంగతనం చేద్దాం అవకాశం కోసం చూస్తుండగా మెట్పల్లి గ్రామంలో ఒక మోటార్ సైకిల్ కనబడగా అట్టి మోటార్ సైకిల్ దొంగతనం చేసి వారు ఉంటున్న రూమ్ వద్దకు తీసుకోవచ్చి తేదీ 28. 8.2023 దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పై దొంగతనం చేయుటకు కొండగట్టు వైపు నుండి
సిరిసిల్లకు వచ్చి అక్కడ నుండి ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట ,కిష్ట నాయక్ తండ లో,తేదీ 14. 9 .2023 రోజున చందుర్తి మండలం లో గోస్కులపల్లి గ్రామంలో మరియు తేదీ 23.9.2023 రోజున మల్యాల గ్రామంలో అదే రోజున జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో తేదీ 5.10. 2023 రోజున కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో మరియు పెద్దపెల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ, పోతన కాలనీ నందు జరిగిన దొంగతనాతో పాటుగా పలు దొంగతనాలకు పాల్పడటం జరిగింది.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచరి,సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ అశోక్ ,సిబ్బంది పాల్గొన్నారు.
