సిద్దిపేట నుండి యాదగిరిగుట్ట బస్సు పోతిరెడ్డిపల్లి మీదుగా బస్సు వెళ్లాలని ధర్నా
అక్టోబర్ 17
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా సిద్దిపేట నుండి యాదగిరిగుట్ట కు వెళ్లే బస్సు రావడంలేదని గంటసేపు పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఒక గంట సేపు ఆందోళన నిర్వహించారు
ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి బస్సు రావడం లేదని ఆందోళన నిర్వహించారు ఎట్టకేలకు కండక్టర్ డ్రైవర్లు సిద్దిపేట డిఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పోతిరెడ్డిపల్లి మీదుగా వెళ్ళమని చెప్పగా ఎట్టకేలకు బస్సు రావడం జరిగింది
ఈ కార్యక్రమంలో పులిగిల్ల స్వామి, గుడిసె ప్రశాంత్, పోరెడ్డి నవీన్, ఆరెపల్లి సురేష్, మడికొండ ఆంజనేయులు, బెస్త పరమేశు, బెస్త గణేష్, మరికొండ కమలాకర్, గుర్రం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు
