రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి కాపీ కొట్టినట్టుగా ఉందని సోమవారం అన్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీటీసీ బొగ్గు బాలరాజు యాదవ్,కొమిరిశెట్టి తిరుపతి పటేల్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గర ఆదివారం పార్టీలో చేరగా వీరిని సన్మానించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజలు ఆమోదించే పరిస్థితిలో లేరన్నారు ముఖ్యమంత్రి చెప్పే మాటలను ఆచరణలో బిఆర్ఎస్ ప్రభుత్వం చూపదని అన్నారు
