రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ (తేది :21- 10- 2023 నుండి 31 -10 -2023) వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు
