.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన పదిమంది యువకులు భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన లేగల వినోద్ రెడ్డి. బిజెపి బూత్ ఎన్ రోలర్. కొంగరి సతీష్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మానుక దేవేందర్ తో పాటు పదిమంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభసూచికమన్నారు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీముల గ్యారంటీ పథకంపై తమకు నమ్మకం కలిగి కాంగ్రెస్ పార్టీలో వీరు చేరడం జరిగిందన్నారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ కార్యదర్శి లు. గిరిధర్ రెడ్డి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి చెన్ని బాబు తదితరులు పాల్గొన్నారు.
