రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఓ మహిళ ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కోలా సులోచన (35) అనే మహిళ తన భర్త రాజారాం ద్విచక్ర వాహనంపై ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న బిడ్డ వద్దకు శుక్రవారం వచ్చింది. శనివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి బయలుదేరి వెళ్తుండగా ముస్తాబాద్ గ్రామ శివారులో ప్రమాదవశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి తలకు తీవ్ర గాయాలయి కాగా అక్కడికక్కడే మృతిచెందని మృతురాలు బిడ్డ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.దీంతో పండగ పూట విషాదఛాయలు అమ్ముకున్నాయి.
