దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ తోమిదేళ్ల పాలనలో కోనాపూర్ గ్రామం ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సర్పంచ్ పంచమి స్వామి, కోనాపూర్ బిజెపి గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్ లు అన్నారు. శనివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎంపీ హోదాలో ఉండి గ్రామానికి ఇచ్చిన హామీలు మర్చిపోయారని వారన్నారు.. గ్రామపంచాయతీ భవనం పెండింగ్ పనులకు ఎంపీ గత ఆరు నెలల క్రితం కొబ్బరికాయ కొట్టితే నేటి వరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరామని తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వెంకటేష్, బాలస్వామి, ప్రభాకర్, అశోక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు….
