రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గిద్ద చెరువులో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి చెందిన అనారాశి రాజశేఖర్ అనే వ్యక్తి శనివారం ఉదయం చేపలు పట్టెందుకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సిరిసిల్ల కరీంనగర్ రెస్క్యూ టీం సుమారు మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు గల్లంతన్న యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రేణుక సంవత్సరం కుమారుడు లక్ష్మణ్ లు ఉన్నారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
