రామగుండం పోలీస్ కమిషనరేట్
పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
పరారిలో మరొకరు,రూ.18,490/- నగదు, 5 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ చెతులపూర్ గ్రామ సమీప ప్రాంతంలో డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి మందమర్రి ఏరియా లోని చతులపూర్ గ్రామ శివారులోని పేకాట స్థావరం పైన రైడ్ చేయగా 5 గురు వ్యక్తులు, 5 సెలఫోన్లు, 4 ధ్విచక్ర వాహనాలు మరియు 18,490 రూపాయల నగదు దొరికింది మరియు ఒక వ్యక్తి పరారిలో వున్నాడు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు, ద్విచక్ర వాహనాలు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.





