బొప్పాపూర్ నుండి ఆటోలో విజ్ఞాన్ స్కూలుకు విద్యార్థులను తీసుకువస్తుండగా అందులో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరినీ శ్రీ చైతన్య లో దింపి తిరిగి విజ్ఞాన్ పాఠశాలకు వస్తున్న క్రమంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై గాయత్రి కాలేజ్ ముందు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కాగా ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. అటుగా వెళుతున్న వారు ఆగి వెంటనే ఆటోను పైకి లేపి విద్యార్థులను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
