ప్రాంతీయం

ఆత్మ కమిటీ చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ….

116 Views

గజ్వేల్ పట్టణంలోని ఆత్మ కమిటీ కార్యాలయంలో సోమవారం బారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి,ఎంపీపీ అమరావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల బాగుకోసం అహర్నిశలు తపించే వ్యక్తి కేటీఆర్ అని అన్నారు.ఐటీ మరియు మున్సిపల్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ నిరంతరం శ్రమిస్తూన్నారని అన్నారు.కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌కు ఉజ్వల భ‌విష్య‌త్తు ఉంటుందని అన్నారు.మంత్రి కృషి వ‌ల్లే పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రాష్టానికి వస్తున్నాయని అన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో యువ‌నేత అవిశ్రాంత కృషి చేస్తున్నారని కొనియాడారు.ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రిగా దేశ‌,విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల‌ను రాబ‌డుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి అహ‌ర్నిష‌లు కృషి చేస్తున్న ఘ‌న‌త కేటీఆర్ కే ద‌క్కుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వామి,ఆత్మ కమిటీ డైరెక్టర్ సంపత్ కుమార్, కూరాకుల సాయి, హనుమంత్ రెడ్డి, ఆత్మ కమిటీ ఏడి బాబు నాయక్, వర్గల్ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *