రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఆనరాశి రాజశేఖర్ (35) అనే వ్యక్తి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు గిద్దె చెరువులోకి వెళ్ళాడు.చేపలు పడుతున్న క్రమంలో కాలుజారి లోతైన ప్రాంతంలోకి వెళ్లి గల్లంతయ్యాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీస్ వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తికి భార్య రేణుక కుమారుడు లక్ష్మణ్ ఉన్నారు.
