ప్రాంతీయం

గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత..

115 Views

గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత

సిద్దిపేట్, గౌరారం జులై 14, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా గౌరారం  14-07-2026 నాడు ఉదయము నమ్మదగిన సమాచారము మేరకు జె . ఆరోగ్యం, ఎస్ ఐ పి  గౌరారం  తన సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు వాహన తనఖీ చేయుచుండగా ఒక అశోక్ లేలాండ్ లారీ నెం. AP39 TH 8653 రాగా దానిని తనిఖీ చేయగా, అందులో ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ ( ఎఫ్ ఆర్ కె ) కలిసిన అనుమానిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్ ) సన్నబియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినాము. వెంటనే సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంనకు సమాచారము ఇవ్వగా ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ( ఏ సి ఎస్ ఓ)గా విధులు నిర్వహిస్తున్న  మేటపల్లి సాయి రవి, రాగా అతని సమక్షంలో పంచనామా నిర్వహించబడింది. విచారణలో లారీ డ్రైవర్ దీపక్ పున్ తెలిపిన వివరాల ప్రకారం, లారీ యజమాని తవిటి యోగేష్ రాజన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడ టోల్ ప్లాజా ఎగ్జిట్ నెం.14 నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్తుతెలియని గోదాం నుండి బియ్యాన్ని లోడ్ చేసి అహ్మదాబాద్ (గుజరాత్ రాష్ట్రం) కు తరలిస్తున్నట్లు తెలిపాడు. అయితే బియ్యం యజమాని, సరుకు పంపిన వ్యక్తి లేదా లోడ్ చేసిన వారి వివరాలు తనకు తెలియవని పేర్కొన్నాడు. తనిఖీ సమయంలో డ్రైవర్ వద్ద ట్యాక్స్ ఇన్వాయిస్, కొనుగోలు బిల్లు, ఈ-వే బిల్, డెలివరీ చలాన్, స్టాక్ ట్రాన్స్‌ఫర్ చలాన్ లేదా ఇతర చట్టబద్ధ పత్రాలు ఏవీ లేకపోవడంతో, బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తమైంది. అనంతరం బియ్యం నమూనాలను సేకరించి, సీల్ చేసి పరీక్షల నిమిత్తం భద్రపరిచినాము. ఘటన స్థలంలో తగిన నిల్వ సౌకర్యం లేకపోవడంతో, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తుది తూకంలో మొత్తం 590 బస్తాలు, 29,450 కిలోగ్రాములు (294.50 క్వింటాళ్లు) పోలీసు బందోబస్తుతో మర్కూక్ మండలం, నర్సన్నపేట గ్రామంలోని శ్రీ రామాంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ గోదాముకు తరలించి భద్రపరిచినాము. అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో, ఈ బియ్యం అత్యావసర వస్తువుల చట్టం–1955 మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ (కంట్రోల్) ఆర్డర్–2016లోని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మళ్లించి, ఇతర రాష్ట్రానికి తరలించు చున్నట్లు గుర్తించారు..

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *