ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్13, మండలం టియుడబ్ల్యూజె నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి సంఘ సభ్యులు అందరూ హాజరుఆయ్యారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అబ్రమేని దేవేందర్ (V6 వెలుగు), గౌరవ అధ్యక్షులు అవధూత శేఖర్ (సాక్షి ), గౌరవ సలహాదారుగా చెవుల మైలారం యాదవ్ (ఆంధ్రజ్యోతి) ఉపాధ్యక్షులుగా మెంగని రాజు (వాయిస్ న్యూస్), మేకర్తి శ్రీనివాస్ (వాయిస్ టుడే), ప్రధాన కార్యదర్శి పెద్ది గారి దేవరాజు (కలం నిఘా), సంయుక్త కార్యదర్శి గుండవేని దేవరాజు (తెలంగాణ ఎక్స్ ప్రెస్), కోశాధికారి కడమంచి రవి (వాస్తవం), కార్యదర్శి నేరెళ్ల స్వామి (ప్రజాపక్షం)కార్యవర్గ సభ్యులు కరెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి (కానుక), డొక్క రాజేష్ (ప్రజాస్ఫూర్తి), దబ్బెడ రమేష్ (ప్రజా తీర్పు), కొల్లూరి సంతోష్ (నిజం), తాటిపల్లి రాజేష్(అక్షర విజేత), కర్రోళ్ళ రాజు (న్యూస్ తెలంగాణ), ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు అబ్రమేని దేవేందర్ మాట్లాడుతూ… తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల సమస్యల పట్ల, వారికి న్యాయంగా రావాలసిన హక్కుల పట్ల అందర్నీ కలుపుకొని పోతానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్లు , హెల్త్ కార్డులు అందేలా క్రుషి చేస్తానని తెలిపారు.
