ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్13, బీసీల మహాసభ విజయవంతం చేయండి ఈనెల 15-10-2023న కాచిగూడ మున్నురుకాపు పంక్షన్ హాల్లో జరిగే బీసీ డిమాండ్ లకై బీసీల మహాసభను విజయవంతం చేయాలని ఈడుగురాల సురేష్ గౌడ్ కోరారు. వారుమాట్లాడుతూ 75 సంవత్సరాలుగా రాష్ట్ర చరిత్రలో 15 మంది ముఖ్యమంత్రులు మారినా 60 శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి రాజకీయ పార్టీలు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. అధికారం రావడానికి అడుగు అడుగున నిలబడే బీసీలకు మావాటా ప్రకారం కూడా సీట్లు ఇవ్వరా అని అన్నారు బీసీల మహాసభ విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో బీసీ యువజన జిల్లా కన్వీనర్ చిగురు వెంకన్న ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీకాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దూరి శ్రావణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మహిపాల్, సంకేత్ వేణు తదితరులు పాల్గొన్నారు.
