రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామం లోని చింతల చెరువులో మండల కేంద్రానికి చెందిన మత్స్యకారులు ఈ చెరువులో చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఈ క్రమంలో చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్ళగా అవి చనిపోయి ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
చింతల చెరువులో చేపలు మృత్యువాత పడ్డాగా, ఇవి సుమారు టన్ను రూ.లక్ష విలువ చేసే చేపలు మృతి చెంది, ఉంటాయని అంచనా వేశారు,చేపలు మృత్యువాత పడడానికి విష ప్రయోగం చేశారా? లేదా మరేదైనా కారణం ఉందా? అని గ్రామస్తులు ముత్యుకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…
