*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
*రూ 24,670 నగదు, 04 మొబైల్స్ స్వాధీనం*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రనగర్ లోని ఒక ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ లు రవి ప్రసాద్, రాజేష్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలీయా, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్ లతో కలిసి రైడ్ చేయగా 04 గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.24,670 నగదు, 04 మొబైల్స్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
*పట్టుపడిన వారి వివరాలు*
1.మాచర్ల రాజేష్ s/o గంగారాం ఇంద్రనగర్. రామగుండం
2.పోముల కృష్ణ s/o మొండయ్య, మార్కెండేయ కాలనీ, గోదావరిఖని.
3.కాంపెల్లి నదు s/o లింగయ్య, ఆదివారంపేట, రామగిరి మండలం.
4.వొదనపల్లి రాంమోహన్ రావు s/o సుదర్శనఁ, గౌతమీ నగర్, ఏన్టీపీసీ.
