రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఇంట్లోకి ఓ వ్యక్తి అక్రమంగా అర్ధరాత్రి చొరబడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు.
మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొత్తూరు రమేష్ అనే వ్యక్తి ఇంట్లోకి ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దూరి శివకుమార్ అనే మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా ఇంట్లోకి చొరబడి రమేష్ తో గొడవకు దిగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివకుమార్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
