(తిమ్మాపూర్ అక్టోబర్ 24 )
కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ఎలిగేటి శివకుమార్ (20) అనే యువకుడు దుర్గ భవాని మాల వేసుకున్నాడు.సోమవారం మాల విరమణ చేసి, తన స్నేహితులతో కలిసి దుర్గభవాని మాల తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ కాకతీయ కెనాల్ లో వేస్తుండగా కాలుజారి ప్రమాదవశాత్తు పడిపోయి కొట్టుకుపోవడం తో స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించడంతో నీటిని నిలిపివేశారు..
మంగళవారం సాయంత్రం యాదవులపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాల్వలో మృతుదేహం కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి ఎస్సై ప్రమోద్ రెడ్డి కి సమాచారం అందించడంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయం తో యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎలిగేటి మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టమని ఎస్ఐ తెలిపారు…




