ప్రకటనలు

అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌

131 Views

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చుఅని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ తెలిపారు.

 

ఈ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *