సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికుల అధిక పని భారంపై హాస్పిటల్ ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో 230 పడుకలు ఉన్నాయి కానీ ప్రభుత్వం 75 పడకల ఆస్పత్రిగా పరిగణించి 44 మంది సానిటేషన్ కార్మికులను పనిచేయడానికి మాత్రమే జీవో జారీ చేయడం జరిగింది.
ఇలా జరగడానికి ప్రధాన కారణం ఆస్పిటల్ బాధ్యత వహిస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 230 పడకల ఆసుపత్రిని 75 పడకలకు ఉన్నాయని రిపోర్టు ప్రభుత్వానికి పంపించడం ద్వారా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అధిక పని భారం పడడం వలన అనారోగ్యానికి గురికావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
