తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే నెల 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 15 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అన్ని అన్నారు. 30 వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ 3 వ తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.




