ఖరీఫ్ 2023-24 సీజన్ లో వరి ధాన్యం కొనుగులు కు సంబందించిన కార్యాచరణ ప్రణాళిక పై శ్రీ ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించబడింది. ఖరీఫ్ 2023-24 సీజన్ లో కొనుగోళ్ళు సజావుగా జరుగుటకు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు మరియు సంబందితఅధికారులకు సూచనలు ఇవ్వటం జరిగినది.
ఈ సందర్భంగా ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సీజన్లో లో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు చేయనున్నామని , ఇందుకై జిల్లాలో 258 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని (ఐ.కె.పి-45 , పి.ఎ.సి.ఎస్-200, డి.సి.ఎం.ఎస్-09, మెప్మ-04) తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో కనీస మౌలిక వసతులయిన త్రాగు నీరు, విద్యుతు, రైతులు కూర్చోవడానికి కుర్చీలు, పందిళ్ళు(టెంట్లు ) వేయించి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే ప్రభుత్వాదేశానుసారం ఫాక్ప్ర మాణాల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రతి కొనుగోలు కేంద్రములో తార్పలిన్స్, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్ యంత్రముతప్పకుండ సమకూర్చుకోవాలని తెలిపారు.




