అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉంటూ మోడల్ కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సూచించారు.
మంగళవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నిక్కచ్చిగా అమలు పైఫ్లయింగ్ స్క్వాడ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిష్పక్షపాతంగా , పారదర్శంగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన సమయంలో సీజ్ చేసేటప్పుడు కచ్చితంగా పంచనామా చేయాలన్నాడు. ఆ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేయాలన్నారు.




