రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ ఊరు తండా గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జై సేవాలాల్ ఊరు తండా గ్రామానికి చెందిన అజ్మీర సుశీల ఇంటి వద్ద గుడుంబా తయారు చేస్తుందన్న సమాచారంతో వెళ్లి చూడగా 30 లీటర్ల ఇప్పపువ్వు బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని సుశీల పై కేసు నమోదు చేయడమైనదని ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన గుడుంబా తయారు చేసి అమ్మిన ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించిన చట్టరీత్యా కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.ఇక్కడ కానిస్టేబుల్ విశాల్ రాజ్, రవి,తిరుపతి,హుస్సేన్, లు ఉన్నారు.




