(మానకొండూర్ అక్టోబర్ 10)
కరీంనగర్ జిల్లా మనకొండుర్ గ్రామంలో ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. 50 మంది మహిళలకు నాలుగు రకాల పండ్ల మొక్కలు కొబ్బరి,బత్తయి, ఆరెంజ్, డ్రాగన్ ప్రూట్ మొక్కలు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీతా మాట్లాడుతూ..
సేంద్రియ ఎరువులతోనే పండ్లు మొక్కలను పెంచాలని సీజనల్ వచ్చే పండ్లు తప్పక తినాలని, పండ్ల లో అనేక రకాల మిటమిన్ ఉంటాయి అన్నారు. పండ్లు తినడం వలన ఆరోగ్యoగా ఉంటారు సేంద్రియ ఎరువుల ద్వార పండ్లు పండించేందుకు కృషి చేసి ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పండ్ల మొక్కలు వాటి ఉపయోగాలు పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిస్టర్ దీప్తి, సిస్టర్ అరుణ, సంస్థ ప్రతినిధులు మర్రి మల్లేశం, నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రమేష్,రూప, స్రవంతి, మౌనిక,50మంది మహిళలు పాల్గొన్నారు.