ములుగు జిల్లా, ఏటూరునాగారం, అక్టోబర్ 09
ఏటూరునాగారం ఏజెన్సీ మండలాలలో ప్రతి వేసవిలో ఏదో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అందుబాటులో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఫైర్ ఇంజన్ అందుబాటులోకి వస్తుంది.
ఫైర్ స్టేషన్ లేకపోవడంతో పరిస్థితిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు వినతి రూపంలో అధిష్టానం తెలపడంతో ప్రభుత్వం ఫైర్ స్టేషన్ మంజూరు చేసింది.పార్టీ శ్రేణులతో కలిసి ఫైర్ ఇంజన్ ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు.ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్ కేంద్రానికి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ స్టేషన్ ను మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా కేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికి పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏజెన్సీ ప్రజల కోసం ఫైర్ స్టేషన్ ను మంజూరు చేసింది. కాగా సోమవారం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనరసింహారావు పార్టీ శ్రేణులతో కలిసి ఫైర్ ఇంజన్ ను ప్రారంభించారు.




