డివిజన్ ప్రకటించకపోతే చేర్యాల రణరంగమే
జేఏసీ డివిజన్ నాయకులు
గద్దల మహేందర్
అక్టోబర్ 9
సిద్దిపేట జిల్లా దులిమిట్ట . చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయకపోతే, ప్రాంతం రణ రంగమై కదనరంగంలో దూకుతుందని, తెలుపుతూ, దూల్మిట్ట మండల కేంద్రంలో, అంబేద్కర్ చౌరస్తాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం తలపెట్టిన బంధు సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం మాట్లాడుతూ, చేర్యాల డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రజలంతా కలిసి ఉద్యమిస్తారని, అధికార పార్టీ నేతలను ప్రజలు గ్రామాల్లో అడ్డుకుంటారని తెలియజేస్తూ, హరీష్ రావు
ఈ ప్రాంతంపై విషం చిమ్ముతూ అధికార బలాన్ని ప్రయోగిస్తున్నాడని తెలియజేస్తూ, అభివృద్ధికి ఆటంకిగా మారినాడని ప్రజలంతా సంఘటితమై, ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరుతూ, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం తో ముందుకు వస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మీరు డివిజన్ తీసుకురాకపోతే, ఓట్ల ప్రచారానికి ఎలా తిరుగుతారో మా ప్రజలు గమనిస్తారని తెలియజేస్తూ, ప్రజలంతా స్వచ్ఛందంగా ఈనెల 11న జరిగే బందులో పాల్గొని జయప్రదం చేయాలని, కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పూల సాయిలు సుద్దాల వినయ్ చెన్నోజు రాజు విశాల పురం బాబు రాజు సురేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.





