వర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 9:చూడనికి తల్లిదండ్రులు లేరు ఉండనికి ఇల్లులేదు.
మైలారంగ్రామానికి చెందిన కొత్తోల్లా రాజు, రగుపతి ఇద్దరు అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు, వీరి బాల్యంలోనే అనారోగ్యకారణాలతో మరణించినారు.వారు మరణించిన సమయానికి వారి వయసు ఒకరికి 7 సంవత్సరాలు మరొకరికి 5 సంవత్సరాలు పెద్ద అబ్బాయి పనిచేసుకుంటు 10 వ తరగతివరకు చదువుకున్నాడు.చిన్న అబ్బాయి కూడా 10 వ తరగతి వరకు చదువుకున్నాడు.వీరి అలాన పాలన వీరి అమ్మమ్మ చూసుకునేది
ఇప్పుడు తనకు చేతకాకుండా అయినది ఇల్లు లేక ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. వారు కూడా బెట్టిన డబ్బులతో బేస్ మెట్ వరకు నిర్మించుకున్నారు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి డబుల్ బెడ్డురూం మంజూరు చేస్తారేమో అని వేచిచూస్తున్నారు.వీరి అమ్మ అమ్మగారు78 సంవత్సరాలు వయసు తనకి కండ్లు కూడా కనిపించట్లేదు. నేను బ్రతికుండగా నా పిల్లలకి ఒక నిడా చేసి పిల్లలకి పెళ్ళిలు చేస్తాను అని అనుకుంటున్నాను.ఇల్లులేకుండా ఎవరు పిల్లను ఇస్తారు , మా గోడు విని ప్రభుత్వం గాని దాతలు కానీ ఎవరైనా సహాయం చేయగలరని విన్నవించుకుంది.